: హైకోర్టు అధీనంలోకి సిట్... న్యాయస్థానం ఆధ్వర్యంలో శేషాచలం ఎన్ కౌంటర్ దర్యాప్తు


శేషాచలం ఎదురుకాల్పుల ఘటనపై ప్రభుత్వం నియమించిన సిట్ (ప్రత్యేక దర్యాప్తు సంస్థ)ను హైకోర్టు తన అధీనంలోకి తీసుకుంది. ఈ మేరకు కోర్టు ఈ రోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 60 రోజుల్లోగా కాల్పుల ఘటనపై దర్యాప్తు పూర్తి చేయాలని సిట్ ను ఈ సందర్భంగా ఆదేశించింది. ఈ క్రమంలో న్యాయస్థానం ఆధ్వర్యంలో శేషాచలం ఎన్ కౌంటర్ దర్యాప్తు జరగనుందన్నమాట. కాగా సిట్ లో ఉన్న సభ్యులపై అభ్యంతరాలుంటే ప్రమాణ పత్రం దాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.

  • Loading...

More Telugu News