: అసదుద్దీన్ ఒవైసీ బీజేపీ తొత్తు: యాకూబ్ ఖురేషీ


ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ భారతీయ జనతా పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని, మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమికి లబ్ధిని చేకూరుస్తున్నారని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ నేత యాకూబ్ ఖురేషీ విమర్శించారు. ముస్లిం వర్గాలను ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. శివసేన డిమాండ్ చేస్తున్నట్టుగా ముస్లింల ఓటుహక్కును రద్దు చేసే దిశగా బీజేపీ నిర్ణయం తీసుకుంటే అధికారానికి దూరమవుతుందని ఆయన హెచ్చరించారు. ముస్లింలకు 14 శాతం రిజర్వేషన్లు ఇస్తామని అధికారంలోకి వచ్చిన సమాజ్ వాదీ కేవలం యాదవులకు మాత్రమే ఉపయోగపడుతోందని అన్నారు. భారతదేశాన్ని నిర్మించింది బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు కాదని, ముస్లింలేనన్నది గుర్తుంచుకోవాలని అన్నారు.

  • Loading...

More Telugu News