: ఏపీ ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. కర్నూలులో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 4,03,496 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవగా, 2,90,789 మంది ఉత్తీర్ణత సాధించినట్టు వెల్లడించారు. ఈ ఏడాది రెగ్యులర్ ఉత్తీర్ణత శాతం 72.07శాతంగా నమోదైందని మంత్రి తెలిపారు. 2013, 14, 15 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 1.19 శాతం మరింత పెరిగిందని చెప్పారు. అంతేగాక తెలంగాణ ఉత్తీర్ణత శాతం కంటే ఏపీ ఉత్తీర్ణత శాతమే ఎక్కువని అన్నారు ఇంటర్ మొదటి ఏడాది ఫలితాల్లానే ఉత్తీర్ణతలో బాలికలే పైచేయి సాధించారని... అమ్మాయిలు 74.80 శాతం, అబ్బాయిలు 69.43 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు వెల్లడించారు.