: నేపాల్ కు బాసటగా నిలుద్దాం... ట్విట్టర్ లో వైఎస్ జగన్ పిలుపు
పెను భూకంపంతో అతలాకుతలమైన నేపాల్ కు బాసటగా నిలుద్దామంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం ఆయన ట్విట్టర్ వేదికగా భారత దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. భూకంపంతో పెను విషాదంలో కూరుకుపోయిన నేపాల్ తిరిగి కోలుకునేదాకా అండగా నిలవాలని ఆయన కోరారు. నేపాల్ లో సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా భారత్ సహాయం కొనసాగాలని కూడా జగన్ ఆకాంక్షించారు. వరుస భూకంపాల నేపథ్యంలో నేపాల్ లో 4,300 మందికి పైగా మృత్యువాత పడగా, 17 వేల మందికి పైగా గాయపడ్డారు.