: ఆ కల తీర్చుకునేందుకు అంత తొందరెందుకు?: ఐఓసీ చీఫ్ బక్


2024లో ఒలింపిక్స్ నిర్వహించాలన్న కోరికతో బిడ్ ను దాఖలు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తున్నదని వచ్చిన వార్తలు తనకు ఆశ్చర్యాన్ని కలిగించాయని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చీఫ్ థామస్ బక్ వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్ పై భారత్ ఆశలు తనకు తెలుసునని, అయితే, ఆ కల నెరవేర్చుకునేందుకు తొందరపడరాదని అన్నారు. ముందు ఆటగాళ్ల సామర్థ్యం పెంచుకుని, మరిన్ని విభాగాల్లో సత్తా చాటి, పతకాలు తెచ్చే వారిని తయారు చేసుకోవాలని, తొలుత రియో ఒలింపిక్స్ పై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. నిన్న సాయంత్రం బక్ ప్రధాని మోదీని కలిసి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఒలింపిక్ పోటీల నిర్వహణ దిశగా భారత్ అడుగెయ్యాలనుకుంటే, తలుపులు ఎప్పుడూ తెరిచేవుంటాయని అన్నారు. 2024లో విజయవంతంగా బిడ్ ను దాఖలు చేయడం భారత్ కు కష్టమేనని మోదీ కూడా అంగీకరించారని తెలిపారు.

  • Loading...

More Telugu News