: కోర్టుల అత్యుత్సాహంతో ఆర్థిక వృద్ధికి విఘాతం... కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ వివాదాస్పద వ్యాఖ్య


దేశంలో న్యాయస్థానాలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. కోర్టుల అత్యుత్సాహంతో దేశంలో ఆర్థిక వృద్ధికి విఘాతం కలుగుతోందని ఆయన కొత్త భాష్యం చెప్పారు. అవినీతికి, పొరపాటుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పక్కాగా నిర్ధారించేలా అవినీతి నిరోధక చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వ్యవస్థాపక డైరెక్టర్ డీపీ కోహ్లీ మెమోరియల్ 16వ వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో సరిగా విచారణ జరగలేదని భావించిన కొన్ని కేసులను కోర్టులు నేరుగా పర్యవేక్షించడం ఇటీవల పెరిగిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టుల అత్యుత్సాహం నేపథ్యంలో విచారణ సంస్థల విచక్షణాధికారాలు పరిమితమవుతున్నాయని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News