: ఢిల్లీపై లష్కరే డ్రోన్ దాడులు చేయొచ్చు... నిఘా వర్గాల హెచ్చరికతో నగరంలో హై అలర్ట్
దేశ రాజధాని ఢిల్లీపై ఉగ్రవాదులు దాడులకు విరుచుకుపడేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదివరకు దేశంలోకి అక్రమ మార్గాల్లో చొరబడి ప్రత్యక్ష దాడులకు దిగిన ఉగ్రవాదులు, తాజాగా మునుపెన్నడూ లేని విధంగా డ్రోన్లతో దాడులు చేసేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంస్థల ఉగ్రవాదులు ఈ తరహా సరికొత్త దాడులకు సిద్ధమవుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు, నగరంలో హై అలర్ట్ ప్రకటించారు.