: విద్యుత్ తీగలు తగిలి కళాశాల బస్సు దగ్ధం
రహదారిపై వెళుతున్న ఓ కళాశాల బస్సుకు విద్యుత్ తీగలు తగలడంతో ఆ బస్సు అక్కడికక్కడే దగ్ధమైంది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెనుమంచిలిలో నేటి ఉదయం జరిగింది. బస్సుకు నిప్పంటుకోగా, వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ విద్యార్థులందరినీ కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో విద్యార్థులు క్షేమంగా బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.