: లేడీ డాక్టర్ పై సినీ నిర్మాత కల్యాణ్ దాడి... జూబ్లీహిల్స్ పీఎస్ లో కేసు నమోదు
వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన టాలీవుడ్ నిర్మాత చిల్లర కల్యాణ్ ఓ మహిళా డాక్టర్ పై చేయి చేసుకున్నారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కల్యాణ్ పై కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళితే, హైదరాబాదులో మెట్రో రైలు నిర్మాణం నేపథ్యంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం.5లో స్థలాలు కోల్పోయిన భూ యజమానులకు ప్రభుత్వం నష్ట పరిహారం మంజూరు చేసింది. పరిహారం పంచుకోవడంలో కల్యాణ్, మహిళా డాక్టర్ కవితల మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఇరువురి మధ్య నిన్న వాగ్వాదం చోటుచేసుకోగా విచక్షణ కోల్పోయిన కల్యాణ్ ఆమెపై చేయిచేసుకున్నాడు. దీంతో కవిత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కల్యాణ్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు.