: ఔటర్ పై రోడ్ టెర్రర్... ఇన్ఫోసిస్ మహిళా టెక్కీ దుర్మరణం


వేగానికి స్వర్గధామంలా మారిన హైదరాబాదు ఔటర్ రింగు రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఔటర్ పై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. నేటి తెల్లవారుజామున ఆ రోడ్డుపై చోటుచేసుకున్న ప్రమాదంలో మహిళా టెక్కీ దుర్మరణం పాలైంది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కారులో బయలుదేరిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని నజియా సుల్తానా చనిపోయింది. ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై నిలిచి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నజియా సుల్తానాతో పాటు కారు డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వారిద్దరినీ ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యంలోనే నజియా చనిపోయింది. కారు డ్రైవర్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

  • Loading...

More Telugu News