: ‘సత్యం’ రాజుకు ఊరట లభించేనా?... రాజు సోదరుల పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ
మార్కెట్ ను మాయ చేసి మదుపరులను నిండా ముంచిన సత్యం రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు, మిగిలిన ఎనిమిది నిందితులు నాంపల్లి కోర్టు విధించిన శిక్ష నుంచి బయటపడేందుకు శతథా యత్నిస్తున్నారు. ఇప్పటికే సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని నాంపల్లి చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించిన వారికి నిరాశే మిగిలింది. దీంతో వారంతా హైకోర్టును ఆశ్రయించారు. నేడు ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. సత్యం కంప్యూటర్స్ లాభాలు, నెట్ వర్త్ ను అధికంగా చూపిన కేసులో రాజు సోదరులతో పాటు మరో ఎనిమిది మందికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానాను విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరంతా చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.