: మనకో కిరికిరి నాయుడున్నాడు... 'ఛీ పో' అన్నా పోడట: కేసీఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. "మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మనకో కిరికిరి నాయుడున్నాడు. ఆయన ఇక్కడి నుంచి ఛీ పో అన్నా గానీ పోడట. ఆయనకు రాష్ట్రం ఉంది, రాజధాని ఉంది, చాలా సమస్యలూ ఉన్నాయి. ఆయన పని ఆయన చేసుకోవచ్చు కదా. అలా చేయడు. అక్కడ దిక్కులేదు కానీ, చెప్పిన వాగ్దానాలు అమలుచేసే సత్తా లేదు కానీ, పొద్దునలేస్తే లేనిపోని పుల్ల పెడుతుంటాడు ఈడ. ఏపీలో డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి సబ్బు పెట్టాడు. రైతులకు అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి సగం మంది రుణాలు కూడా మాఫీ చేయలేదు" అని ఎద్దేవా చేశారు. కానీ తాము మాత్రం 34 లక్షల మంది రుణాలు మాఫీ చేశామని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. వనరులున్నా లేకపోయినా, మాట ఇచ్చామంటే తల తెగిపడినా వెనక్కుబోమని పునరుద్ఘాటించారు.

  • Loading...

More Telugu News