: గోదావరి నదిలో నిలిచిన పర్యాటక బోటు...ఆందోళనలో పర్యాటకులు


గోదావరి నదిలో పర్యాటక బోటు నిలిచిపోయింది. పాపికొండలు పర్యటన ముగించుకుని వస్తుండగా, తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం వీరవరపులంక దగ్గర బోటులో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో బోటు నిలిచిపోయింది. మరమ్మతులు చేసేందుకు సిబ్బంది ప్రయత్నించినా గేర్ బాక్స్ మొరాయించడంతో, సిబ్బందికి ఏం చేయాలో పాలుపోవడంలేదు. దీంతో బోటులోని వంద మంది పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. సహాయక చర్యలు చేపట్టాలని బంధువులకు ఫోన్ చేశారు.

  • Loading...

More Telugu News