: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సేవలు భేష్: సచిన్


నేపాల్ భూకంప బాధితులకు సహాయమందిస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాని, రాష్ట్రపతి ఎయిర్ ఫోర్స్ సేవలను కొనియాడితే, తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్క్ ప్రశంసల జల్లు కురిపించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న నేపాల్ భూకంప బాధితులకు ఆహారం అందజేసేందుకు ధైర్యంగా వెళ్లి, నిస్సహాయ స్థితిలో పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన చర్యలు అద్భుతమని సచిన్ పేర్కొన్నారు. వాతావరణం అనుకూలించకపోయినా నిరంతరం సేవలందిస్తూ చిత్తశుద్ధి చాటుతున్నారంటూ సచిన్ వారి ధైర్యసాహసాలను కీర్తించారు.

  • Loading...

More Telugu News