: 7.9 తీవ్రతతో ఢిల్లీలో భూకంపం వస్తే ఏమతుంది?


నేపాల్ ను కుదిపేసిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.9గా నమోదవ్వడం తెలిసిందే. ఆ భూకంప కేంద్రం నేపాల్ రాజధాని ఖాట్మండూకు సమీపంలో ఉన్నా భారత్ పైనా గణనీయ ప్రభావాన్నే చూపింది. అదే భూకంప కేంద్రం ఢిల్లీ అయివుంటే ఏం జరిగుండేదన్న ఆలోచనకు నిపుణులు సమాధానమిచ్చారు. ఈ మెట్రోనగరంలో సగం జనాభా తుడిచిపెట్టుకుపోయేదని తెలిపారు. రూర్కీ ఐఐటీ భూకంప ఇంజినీరింగ్ విభాగం ఆచార్యుడు డీకే పాల్ బృందం దీనిపై 2007లో ఓ అధ్యయనం చేసింది. తాజాగా, పాల్ మీడియాతో మాట్లాడుతూ... డేంజర్ జోన్ లో ఉన్న ఢిల్లీలో 7, అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం వస్తే, పెను నష్టం తప్పదని హెచ్చరించారు. ఢిల్లీలోని అత్యధిక ప్రదేశాల్లో భవనాలు భూకంపాలను తట్టుకునే రీతిలో నిర్మితం కాలేదని వివరించారు. మరోవైపు, భారత మెటియరోలాజికల్ విభాగం చీఫ్ లక్ష్మన్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ... ప్రజలను పొట్టనబెట్టుకునేది భూకంపాలు కాదని, భవంతులేనని అన్నారు. పునాదుల నుంచి ప్రమాణాలకు అనుగుణంగా నిర్మితమైతే, ప్రాణనష్టం పెద్దగా ఉండదని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News