: ట్విట్టర్ ఖాతా తెరచిన కత్రినా కైఫ్


బాలీవుడ్ కలల రాణి కత్రినా కైఫ్ ట్విట్టర్ ఖాతా తెరిచింది. కేన్స్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో తొలిసారి ర్యాంప్ పై నడవబోతున్న కత్రినా, ఆ అనుభూతులను పంచుకునేందుకు ట్విట్టర్లో చేరుతున్నట్టు ప్రకటించింది. అంతర్జాతీయ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ మే 13 నుంచి ప్రారంభం కానుంది. ప్రతిసారి జరిగే కేన్స్ చిత్రోత్సవాల్లో ఐశ్వర్యారాయ్ పాల్గోవడం ఆనవాయతీ. గతంలో జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సోనమ్ కపూర్, విద్యాబాలన్ పాల్గొనగా, ఈసారి ప్రముఖ సౌందర్యోత్పత్తుల సంస్థ లోరియల్ పారిస్ బ్రాండ్ అంబాసిడర్ గా కత్రినా కైఫ్ ర్యాంప్ వాక్ చేయనుండడం విశేషం.

  • Loading...

More Telugu News