: నేపాల్ శిథిలాల వద్ద సెల్ఫీలు తీసుకుంటున్న యువత... వీళ్లనేమనాలి?
సోషల్ మీడియా వేలంవెర్రిలో యువతలో విలువలు క్షీణించిపోతున్నాయి. అందుకిదే నిదర్శనం. నేపాల్ ను నేలమట్టం చేసిన భూకంపం, చారిత్రక కట్టడాలను నామరూపాల్లేకుండా చేసింది. ఈ విలయం ధాటికి వేలాది మంది ప్రాణాలు విడిచారు. నేపాలీలది ఇప్పుడు నిజంగా దయనీయ పరిస్థితి! చారిత్రక కట్టడాల సందర్శనకు వెళ్లిన యాత్రికులు ఇప్పుడు ఆ శిథిలాల కింద విగతజీవులయ్యారు. ఓవైపు శిథిలాల కింద శవాల గుట్టలు పడి ఉండగా, ఆ శిథల కట్టడాల ముందు నిలబడి యువత సెల్ఫీలు తీసుకుంటోంది. ఖాట్మండూలోని ధరారా టవర్ కూడా ధ్వంసం కాగా, దాని ముందు నిలుచుని సెల్ఫీ తీసుకుంటున్న యువకుడి ఫొటో భారత మీడియాలో దర్శనమిచ్చింది. సాటి మనుషులకు సాయపడాల్సింది పోయి, సోషల్ మీడియా వ్యసనంతో ఇలా సెల్ఫీలు తీసుకుంటుండడాన్ని ఏమనాలి?