: అంబులెన్స్ కు ప్రమాదం, నిండు గర్భిణి మృతి


ఎవరికైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్ వస్తుంది. మరి అంబులెన్స్ కే ప్రమాదం జరిగితే? అంటూ సినిమాల్లో కామెడీ చేస్తుంటారు. అలాంటి దారుణమే ఢిల్లీ-డెహ్రాడూన్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ సమీపంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండుగర్భిణిని తీసుకుని ఆసుపత్రిలో చేర్చేందుకు వేగంగా వెళ్తున్న అంబులెన్స్ ను ఓ కారు అంతకంటే వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కడుపులోని శిశువుతోపాటు ఆమె మృతి చెందింది. అంబులెన్స్ లో ప్రయాణిస్తున్న నర్సుతోపాటు ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News