: నేపాల్ భూకంప బాధితులకు లోక్ సభ ఎంపీల విరాళం
నేపాల్ భూకంప బాధితులకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరపున సహాయం అందుతుండగా లోక్ సభ సభ్యులు కూడా సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తమ నెల జీతాన్ని భూకంప బాధితులకు విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రతిపాదన మేరకు ఎంపీలందరూ అంగీకరించారు. ఈ మేరకు లోక్ సభలో చేసిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది.