: జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే సెటిలర్లపై కేసీఆర్ ప్రేమ: ఉత్తమ్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ సెటిలర్లపై ప్రేమ ఒలకబోస్తున్నారని టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్ కౌంటర్ బూటకమని ఆరోపణలు వస్తున్నా సిట్టింగ్ జడ్జితో ఎందుకు విచారణ జరిపించలేదని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా నేతలతో హైదరాబాదులోని గాంధీభవన్ లో ఉత్తమ్ సమావేశమయ్యారు. డిసెంబర్ లో జరగనున్న గ్రేటర్ ఎన్నికలు, రాష్ట్రంలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన తదితర అంశాలపై చర్చించారు. తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో చురుకుగా ఉన్నవారికే పదవుల పంపిణీ ఉంటుందని ఉత్తమ్ స్పష్టం చేశారు.