: ఏపీతో పోటీయా?... నో ... మాకు గుజరాతే పోటీ: ఎంపీ కవిత
తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ ఏమాత్రం పోటీ కాదని ఎంపీ కవిత తెలిపారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, అభివృద్ధిలో గుజరాత్ తోనే తమకు పోటీ అని అన్నారు. దేశదేశాలకు వెళ్లి చంద్రబాబు పెట్టుబడులు ఆహ్వానిస్తుంటే, దేశవిదేశాల ప్రతినిధులు హైదరాబాదులో పెట్టుబడులు పెడతామని అంటున్నారని ఆమె తెలిపారు. తక్కువ పనిచేసి ఎక్కువ ప్రచారం చేసుకోవడం చంద్రబాబు సిద్ధాంతమని ఆమె ఎద్దేవా చేశారు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా తాము సఖ్యతతో ఉంటామని ఆమె స్పష్టం చేశారు. చంద్రబాబు సహకరించకపోయినా కోతల్లేని విద్యుత్ సరఫరా చేస్తున్నామని కవిత చెప్పారు. టీఆర్ఎస్ పరిపాలన, పథకాలు నచ్చడం వల్లే టీడీపీ నేతలు తమ పార్టీలో చేరుతున్నారని కవిత అభిప్రాయపడ్డారు.