: ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ పై కమిటీ


ఏపీ రాజధాని మౌలిక వసతుల మాస్టర్ ప్లాన్ కన్సెల్టెన్సీపై ఎనిమిది మంది నిపుణులతో ఓ కమిటీ ఏర్పాటైంది. రాజధాని నిర్మాణం, మౌలిక వసతులపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి కన్సెల్టెన్సీని ఈ కమిటీ ఎంపిక చేస్తుంది. కమిటీ సభ్యులుగా ఏపీ ఆర్ డీపీ ఎండీ జగన్నాధరావు, ఏపీ ట్రాన్స్ కో చీఫ్ ఇంజనీర్ దేవదాస్, సీఆర్ డీ డైరెక్టర్ వి.రాముడు, ఇంధన శాఖ న్యాయ సలహాదారు శివరావు, ఎస్.రమేష్, ప్రతాప్, కాశీ విశ్వేశ్వరరావు, ప్రకాశ్ రావు ఉంటారు.

  • Loading...

More Telugu News