: వాటర్ గ్రిడ్ పథకానికి హడ్కో రూ.10వేల కోట్ల రుణం ఇస్తానంది: కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు లభిస్తూనే ఉన్నాయి. తాజాగా హౌసింగ్ అర్బన్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (హెచ్ యుడీసీఓ) గ్రిడ్ పథకాన్ని మెచ్చుకుందని తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అంతేగాక ఈ పథకానికి హడ్కో వారు రూ.10వేల కోట్ల రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిపారు.