: నా కుమార్తె సినిమాల్లోకి వస్తుందా?...నాకు తెలీదే: సచిన్ టెండూల్కర్


షాహిద్ కపూర్ జతగా సారా టెండూల్కర్ నటించనుందనే వార్తలను ఆమె తండ్రి, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఖండించారు. ఎలాంటి ఆధారం లేకుండా ఇలాంటి వార్తల్ని ఎలా పుట్టిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో స్పందించారు. సారా తన విద్యార్థి జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తోందని అన్నారు. చక్కగా చదువుకుంటోందని ఆయన స్పష్టం చేశారు. సారా సినిమాల్లోకి వచ్చే ప్రయత్నాలేవీ చేయడం లేదని సచిన్ వెల్లడించారు. ఆమె సినిమాల్లోకి వస్తుందన్న వార్తలన్నీ నిరాధారాలేనని ఆయన చెప్పారు. కాగా, సచిన్ కి సారా, అర్జున్ సంతానం.

  • Loading...

More Telugu News