: చదువు రాని రాందేవ్ కు ఉద్యోగమా?: హర్యానా సర్కారుపై కాంగ్రెస్ మండిపాటు


హర్యానా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ, మనోహర్ లాల్ ఖట్టర్ సర్కారుపై దాడి ప్రారంభించింది. ఇందుకోసం యోగా గురువు, ఆ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన బాబా రాందేవ్ ను కేంద్రంగా చేసుకుంది. చదువూ సంధ్యా లేని రాందేవ్ ను, పాఠశాలల్లో యోగా పాఠాలు చెప్పేందుకు ఎలా అనుమతిస్తారని కాంగ్రెస్ విరుచుకుపడింది. అసలు రాందేవ్ ను రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎలా నియమిస్తారని కాంగ్రెస్ పార్టీ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి సంపత్ సింగ్, ఖట్టర్ సర్కారును నిలదీశారు. ప్రాథమిక స్థాయి విద్య కూడా లేని రాందేవ్ ను రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం కుదరదని కూడా సింగ్ తేల్చిచెప్పారు. అంతేకాక గురుకులాలను ఆచార్యకులాలుగా మార్చడాన్ని కూడా సింగ్ తప్పుబట్టారు. మరి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలపై ఖట్టర్ సర్కారు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

  • Loading...

More Telugu News