: ఏపీకి ప్రత్యేక హోదా లేకున్నా రాయితీలు వస్తాయి: మంత్రి పల్లె


ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పందించారు. రాష్ట్రానికి ఆ హోదా రాకున్నా రాయితీలు వస్తాయని మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా కోసం తన వంతు ప్రయత్నం చేస్తారన్నారు. ఏపీ సచివాలయంలో మీడియా సమావేశంలో ఈ మేరకు మంత్రి మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో చంద్రబాబు విఫలమయ్యారంటూ ఏపీ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను పల్లె తిప్పికొట్టారు. సీఎంను విమర్శించే హక్కు ఆ పార్టీకి లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ విడగొట్టినప్పుడు ప్రత్యేక హోదాకు ఎందుకు చట్టభద్రత కల్పించలేదని ప్రశ్నించారు. ఏపీ ప్రజల కష్టాలన్నింటికీ కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు.

  • Loading...

More Telugu News