: ఇండియా ముందు ఎన్నో సవాళ్లు: అరుణ్ జైట్లీ


ఇండియా ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, వాటిని సమర్థవంతంగా అధిగమించేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో నేడు ఆయన డీపీ కోహ్లీ స్మారకోపన్యాసాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గడచిన సంవత్సర కాలంలో ముడిచమురు ధరలు తగ్గడం మినహా భారత్ లాభపడిన అంశాలు లేవని ఆయన అన్నారు. మౌలిక వసతుల రంగం, వ్యవసాయ రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి చాలా నిదానంగా జరుగుతోందని, ఆశించిన స్థాయిలో రైల్వేల్లో పెట్టుబడులు రాలేదని వివరించారు. అవినీతి నిరోధక చట్టంలోని పలు అంశాలను సవరించాల్సి వుందని, ఈ విషయంలో సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విదేశీ పెట్టుబడిదారులు రిట్రాస్పెక్టివ్ టాక్స్ (పునరావృత్త పన్ను)పై భయాందోళనలు పెట్టుకున్నారని, అందువల్లే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదని అభిప్రాయపడ్డ ఆయన, అంత పటిష్ఠంగా లేని ఈ పన్ను విధానాన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులు జరిపిన గత లావాదేవీలపై పన్నులు వేసే ఉద్దేశం లేదని, పూర్తి పారదర్శక విధానాలనే భారత్ అవలంబిస్తుందని హామీ ఇచ్చారు. 'అవినీతి', 'ప్రజా ప్రయోజనాలు', 'డబ్బుకు సంబంధించిన లాభాలు' తదితర పదాలను నేటి తరానికి అనుగుణంగా పునర్ నిర్వచించాల్సి వుందని జైట్లీ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News