: ఏపీలో 11 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా పదకొండు మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. కొన్నాళ్లుగా వెయిటింగ్ లో ఉన్న ఎ.రవిశంకర్ ను డ్రగ్స్ అండ్ కాపీరైట్స్ డీజీగా, గుంతకల్ రైల్వే ఎస్పీగా ఎం.సుబ్బారావు, సీఐడీ ఎస్పీగా జె.బ్రహ్మారెడ్డి నియమితులయ్యారు. నిఘా విభాగం ఎస్పీలుగా ఆర్.విజయలక్ష్మీ, ఎల్.ఎస్.చౌహాన్, అప్పా ఉప సంచాలకులుగా జె.మురళీధర్, బి.అనంతశర్మ, జె.పరిమళ, సీఐడీ ఎస్పీగా ఆర్.ఎన్.అమ్మిరెడ్డి, డీజీపీ కార్యాలయంలో ఎస్పీగా ఎస్.రంగారెడ్డి, సీఐడీ ఏఎస్పీగా సీహెచ్ విజయారావు నియమితలయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.