: నేపాల్ కు టికెట్ ధర రూ. 14 వేల నుంచి రూ. 4,700కు తగ్గించిన ఎయిర్ ఇండియా
నేపాల్ ను కుదేలు చేసిన భూకంపం నేపథ్యంలో ఆ దేశానికి రాకపోకలు జరిపే వారికి సౌలభ్యంగా ఉండేందుకు ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా నుంచి నేపాల్ కు వెళ్లేందుకు ప్రస్తుతం వసూలు చేస్తున్న ధర రూ. 14 వేలను రూ. 4,700 రూపాయల వరకూ తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. ఈ ధర అన్ని పన్నులతో కలుపుకుని ఉంటుందని పేర్కొంది. న్యూఢిల్లీతో పాటు వారణాసి, కోల్ కతా తదితర ప్రాంతాల నుంచి ఖాట్మాండుకు వెళ్లే ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరింది. దీంతో పాటు మే 2వ తేదీ వరకూ బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకుంటే ఎటువంటి పెనాల్టీలు లేకుండా డబ్బు వెనక్కు తిరిగి ఇవ్వాలని కూడా ఏఐ నిర్ణయించింది.