: పేకాట ఆడుతూ... పోలీసులకు పట్టుబడ్డ సినీ నటి కరాటే కల్యాణి
పేకాట శిబిరాలపై దాడులు చేసిన హైదరాబాదు ఎస్ వోటీ పోలీసులు, అక్కడి పేకాటరాయుళ్లను చూసి నోరెళ్లబెట్టారు. ఎందుకంటే, అక్కడ పేకాట ఆడుతున్న వారిలో సినీ నటి కరాటే కల్యాణి కూడా ఉందట. వివరాల్లోకెళితే, హైదరాబాదులోని వనస్థలిపురం పరిధికి చెందిన జహంగీర్ నగర్ లో పేకాట జోరుగా సాగుతోందని నేటి ఉదయం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్ వోటీ పోలీసులు పేకాట శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ నటి కరాటే కల్యాణి సహా 11 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు, రూ.70 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.