: సమ్మెకు సిద్ధమైన తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు


తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు నేరుగా ప్రభుత్వ జీతాలు ఇవ్వడం కుదరదని డిస్కంలు స్పష్టం చేయడంతో సమ్మెకు దిగుతున్నట్టు అందులో తెలిపారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని గతంలో రెండుసార్లు డిస్కంలు హామీ ఇచ్చాయని, ఇప్పుడస్సలు పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తమ డిమాండ్ల సాధన కోసం ఇక సమ్మె చేయాలనుకుంటున్నట్టు ప్రకటనలో తెలిపారు. మరి దానిపై డిస్కంలు ఎలా స్పందిస్తాయో తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News