: నేపాల్ భూకంపంలో 'ఎటకారం' సినిమా యువ నటుడు విజయ్ మృతి


నేపాల్ భూకంపం ధాటికి 'ఎటకారం' చిత్రం డాన్స్ మాస్టర్, యువ నటుడు విజయ్ (25) మరణించాడు. రెండు రోజుల కిందట సంభవించిన భూకంపంలో ఆ చిత్ర బృందం చిక్కుకుపోయింది. తరువాత వారంతా క్షేమంగానే ఉన్నారని సమాచారం అందింది. అయితే యూనిట్ బృందం ఖాట్మండు నుంచి తిరిగి కారులో వస్తుండగా దురదృష్టం వెంటాడింది. మరోసారి వచ్చిన భూకంపంతో కారు అదుపు తప్పడంతో అందులో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా నటుడు విజయ్ చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిసింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విజయ్ స్వస్థలం గుంటూరు జిల్లా బాపట్ల. అతని మృత దేహాన్ని హైదరాబాద్ తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News