: తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫలితాలను హైదరాబాదులోని నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. ఒకేషనల్, రెగ్యులర్ లో 3,78,973 మంది పరీక్షలకు హాజరవగా 2,32,742 మంది ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి తెలిపారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 61.41గా ఉందని చెప్పారు. ఇంటర్ ఫలితాల్లోనూ బాలికలే 66.86 శాతం ఉత్తీర్ణతతో పైచేయి సాధించారని కడియం వెల్లడించారు. బాలురు 65.9 శాతం ఉత్తీర్ణత సాధించారని వివరించారు.