: నవ్యాంధ్ర రాజధానికి మరో ఫ్యాక్టరీ... ట్రాక్టర్ల ప్లాంట్ ఏర్పాటుకు చైనా కంపెనీ సంసిద్ధత
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మంత్రాంగం బాగానే ఫలిస్తోంది. పెట్టుబడులను రాబట్టేందుకు ఆయన విదేశాల్లో చేపట్టిన పర్యటనలు సత్ఫలితాలిస్తున్నాయి. ఇప్పటికే నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో తమ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు బస్సుల తయారీ సంస్థ కింగ్ లాంగ్ ముందుకు రాగా, తాజాగా ట్రాక్టర్ల తయారీలో అగ్రగామిగా ఉన్న చైనా కంపెనీ ఇర్కాట్ అమరావతిలో ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ సంస్థకు అమరావతి పరిధిలో స్థలాన్ని కేటాయించేందుకు కూడా ఏపీ సర్కారు సూత్రప్రాయంగా అంగీకరించింది. అమరావతి పరిధిలో ఏర్పాటు కానున్న తమ ప్లాంట్ లో 35 హెచ్ పీ, 70 హెచ్ పీ సామర్ధ్యంతో ట్రాక్టర్లను ఉత్పత్తి చేయనున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధి జాండీర్ చెప్పారు.