: మానవ రహిత విమానాలతో గోదావరి పుష్కరాలకు భద్రత
త్వరలో జరగనున్న పుష్కరాల సమయంలో గోదావరి నదిపై మానవ రహిత విమానాల (డ్రోన్)తో నిఘా పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో గంగానదికి కుంభమేళా జరిగిన సమయంలో డ్రోన్ల వినియోగం సత్ఫలితాలు ఇవ్వడంతో, అదే విధానాన్ని పాటించాలని హోం శాఖ భావిస్తోంది. మొత్తం ఎన్ని డ్రోన్లు అవసరమవుతాయి, వాటి నిర్వహణ, తదితరాలపై సమాచారం సేకరించాలని రాష్ట్ర డీజీపీ అధికారులను ఆదేశించారు. పుష్కర ఘాట్లలో సీసీటీవీల ఏర్పాటుపైనా సమగ్ర వివరాలందించాలని కోరారు. అదనపు సెల్ టవర్లు, యాత్రికుల వాహనాలకు సరిపడా పార్కింగ్, గజ ఈతగాళ్లు తదితర అంశాలపైనా సమీక్ష జరిపారు.