: రోహిత్ కు అర్జున అవార్డు ఇవ్వండి... కేంద్రానికి బీసీసీఐ సిఫారసు
వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటిదాకా 5 డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. వీటిలో ఓ డబుల్ సెంచరీ విండీస్ పించ్ హిట్టర్ క్రిస్ గేల్ ది కాగా, మిగిలిన నాలుగు మనోళ్లవే. వీటిలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లు చెరొకటి బాదారు. మిగిలిన రెండింటినీ టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు. సుదీర్ఘకాలం పాటు క్రికెట్ ఆడిన సచిన్, విండీస్ దిగ్గజం బ్రయాన్ లారాకు సాధ్యం కాని ఈ ఫీట్ ను రోహిత్ శర్మ అవలీలగా సాధించాడు. గతంలో ఫామ్ లేమితో సతమతమైన అతడు, రెండు డబుళ్లతో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడిని ఘనంగా సత్కరించాలని బీసీసీఐ తీర్మానించింది. అరుదైన రికార్డును కైవసం చేసుకున్న రోహిత్ కు అర్జున అవార్డు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు నిన్నటి సమావేశంలో భాగంగా బీసీసీఐ కేంద్రానికి లేఖ రాసింది.