: నా స్వార్థం కాదు...5 కోట్ల మంది ఆకాంక్ష: సంజీవరావు


స్వార్థం కోసం తాను సెల్ టవర్ ఎక్కలేదని సంజీవరావు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం సెల్ టవర్ ఎక్కిన సంజీవరావు కలెక్టర్ హామీతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదా అని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదని బావించి ఆందోళన చేసినట్టు సంజీవరావు వెల్లడించారు. ఇందులో తన స్వార్థప్రయోజనాలు లేవని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేసేందుకైనా వెనుకాడకూడదని నిర్ణయించుకున్నానని సంజీవరావు తెలిపారు. తాను చేసిన ఈ ఆందోళన వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రజల కోసం చేసిన ఈ ప్రయత్నంపై ఎలాంటి కేసులు నమోదు చేయకూడదని ఆయన సూచించారు. అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News