: 34 గంటల ఆందోళనకు తెరపడింది... టవర్ దిగడానికి అంగీకరించిన సంజీవరావు


34 గంటల ఆందోళనకు తెరపడింది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలంటూ గుంటూరులో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కిన సంజీవరావు వ్యవహారంలో ఉత్కంఠకు తెరపడింది. నిన్న ఉదయం 11 గంటలకు సెల్ టవర్ ఎక్కిన సంజీవరావు దాదాపు 34 గంటలు నిరాహారిగా ఉండడం విశేషం. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆయనతో ఫోన్ లో సంభాషించినా కిందకి దిగని సంజీవరావు, కలెక్టర్ హామీకి సానుకూలంగా స్పందించడం విశేషం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును కలిసి మాట్లాడేందుకు అనుమతించాలని కోరగా, కలెక్టర్ సరే అనడంతో సంజీవరావు బెట్టువీడి కిందికి దిగేందుకు సమ్మతించాడు. దీంతో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సంజీవరావును కిందికి దించేందుకు ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News