: హోం వర్క్ పేరిట ఆరోతరగతి బాలికపై ప్రిన్సిపల్ దాష్టీకం


అరాచకాల ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. తండ్రిలా కాపాడాల్సిన ప్రిన్సిపల్ కీచకుడయ్యాడు. కామంతో కళ్లు మూసుకుపోయి పశువులా ప్రవర్తించాడు. ముజఫర్ నగర్ సమీపంలో ఓ ప్రైవేట్ స్కూల్ నడుపుతున్న ప్రిన్సిపల్ దినేష్ కుమార్ ఆరో తరగతి విద్యార్థిని(15)ని హోం వర్క్ పేరిట స్కూల్లో ఉండమని చెప్పి, అందరూ వెళ్లిపోయిన తరువాత అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగినది ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించాడు. బాధిత బాలిక ఇంటికి వెళ్లాక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రిన్సిపల్ ను అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News