: నిప్పులు చెరిగిన బెంగళూరు బౌలర్లు...ఢిల్లీ 39/4


బెంగళూరు బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో చెలరేగడంతో ఢిల్లీ జట్టు కేవలం 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు రెండు పరుగుల వద్ద ఓపెనర్ శ్రేయస్ అగర్వాల్ (0) వికెట్ కోల్పోయింది. దీంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ డుమిని (13) జాగ్రత్తగా ఆడినప్పటికీ వైస్ వేసిన అద్భుతమైన బంతికి అవుటయ్యాడు. అనంతరం వచ్చిన యువరాజ్ సింగ్ (2) పేలవంగా ఆడి పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత వచ్చిన మాధ్యూస్ ను ఖాతా తెరవకుండానే ఆరోన్ బలిగొన్నాడు. దీంతో 6.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ 39 పరుగులు చేసింది. మయాంఖ్ అగర్వాల్ (18)కు కేదార్ జాదవ్ జతకలిశాడు. బెంగళూరు బౌలర్లలో వరుణ్ ఆరోన్ రెండు వికెట్లు తీసి రాణించగా, అతనికి స్టార్క్, వైస్ చెరో వికెట్ తీసి సహకారమందించారు.

  • Loading...

More Telugu News