: నన్ను సోము వీర్రాజు వేధించాడు... ఇలాంటి బెదిరింపులకు భయపడను!: హీరో శివాజీ
ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందున్న దారి ఆమరణ నిరాహార దీక్షలేనని సినీ నటుడు శివాజీ తెలిపారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, ఆమరణ నిరాహార దీక్షకు తానే దిగుతానని స్పష్టం చేశారు. రాజమండ్రి వచ్చిన తనను షెల్టన్ హోటల్ లో సోము వీర్రాజు వేధించాడని శివాజీ చెప్పారు. గుంటూరులో టవర్ ఎక్కిన వ్యక్తికి మద్దతు పలికానని, అందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ, మూడు గంటలు బీభత్సం సృష్టించారని ఆయన మండిపడ్డారు. సోము వీర్రాజు చేస్తున్న పనులను బీజేపీ ఎలా ప్రోత్సహిస్తుందని ప్రశ్నించారు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే భయపడతానని భావించడం సరికాదని ఆయన హితవు పలికాడు. ప్రత్యేక హోదాను ఇవ్వనని కేంద్రం బహిరంగ ప్రకటన చేయలేదని, చేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.