: హీరోయిన్ నీతూ అగర్వాల్ కు మే 7 వరకు రిమాండ్
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన హీరోయిన్ నీతూ అగర్వాల్ ను కర్నూలు జిల్లా పోలీసులు కోవెలకుంట్ల జడ్జి ముందు హాజరుపరిచారు. ఆమెపై ఆరోపణలు, కేస్ షీట్ చూసిన జడ్జి ఆమెకు మే 7 వరకు రిమాండ్ విధించారు. దీంతో ఆమెను పోలీసులు నంద్యాల జైలుకు తరలించారు. రిమాండ్ లో ఆమెను మరింత విచారించనున్నట్టు సమాచారం. ఇప్పటికే స్మగ్లింగ్ వ్యవహారం, నగదు బదిలీలపై పోలీసులకు సమాచారం అందించిన నీతూ అగర్వాల్, రిమాండ్ లో మరిన్ని వివరాలు అందజేసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్ వలీ నిర్మాతగా వ్యవహరించిన సినిమాలో నీతూ అగర్వాల్ పనిచేసి, అతని ఒత్తిడితో సహజీవనం కూడా చేసి, వివాహం చేసుకున్నట్టు తెలిసిందే.