: చెరువు నిండితే మూడేళ్లు కరవు ఉండదు: కేసీఆర్
ఒక్క ఏడాది చెరువు నిండితే మూడేళ్లు కరవు ఉండదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలంలోని చందుపట్ల గ్రామంలో చెరువు పనులు ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చందుపట్ల చెరువుకు కోటిన్నర నిధులు అదనంగా ప్రకటించారు. రెండు కోట్ల రూపాయలతో చెరువు బాగుపడాలని ఆయన ఆకాంక్షించారు. రేపటి నుంచే పనులు మొదలు కావాలని, పూడికతీత పనుల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాలుపంచుకోవాలని సూచించారు. గోదావరి బేసిన్ నుంచి 175 టీఎంసీలు, కృష్ణా బేసిన్ నుంచి 93 టీఎంసీల నీటిని తెలంగాణకు కేటాయించారని, చెరువులు నిండితే కరవులు ఉండవని ఆయన పేర్కొన్నారు.