: భారత్ కు రుణపడి ఉంటాం: నేపాల్ రాయబారి


భూకంపంతో అతలాకుతలమైన తమ దేశాన్ని ఆదుకునేందుకు స్పందించిన భారత్ కు రుణపడి ఉంటామని నేపాల్ రాయబారి దిలీప్ కుమార్ ఉపాధ్యాయ తెలిపారు. నేపాల్ లో ఆయన మాట్లాడుతూ, అడగకముందే భారత్ సహాయక సామగ్రితో సైనిక, సహాయక బృందాలు పంపినందుకు ధన్యవాదాలని అన్నారు. భారత్, నేపాల్ ప్రభుత్వాలు కలిసికట్టుగా అనుక్షణం పరిస్థితిని పర్యవేక్షిస్తూ, సహాయక చర్యలు చేపడుతున్నాయని ఆయన తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు ప్రత్యేకంగా ధన్యవాదాలని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News