: ఇదీ భారతీయత...నేపాలీలకు ఆపన్నహస్తం
భారతీయులు పెద్దమనసు చాటుకుంటున్నారు. నేపాల్ లో సంభవించిన ప్రకృతి విపత్తుకు మనసున్న ప్రతిమనిషి స్పందిస్తున్నాడు. నేపాల్ ప్రజలకు సానుభూతి తెలుపుతూ, భారత్ లోని పలు రాష్ట్రాల నుంచి సహాయ సామగ్రి పంపుతున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లారీల్లో ఆహారపదార్థాలు పంపించింది. అంతటితో ఊరుకోకుండా 5 కోట్ల రూపాయల సహాయం ప్రకటించింది. నేపాల్ భాధితుల కోసం పంజాబ్ లోని అమృతసర్ లోని స్వర్ణదేవాలయంలో రొట్టెలు తయారు చేస్తున్నారు. అలాగే ఇతర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల ప్రజలు సహాయ సామగ్రి అందించేందుకు ముందుకు వస్తున్నారు. మరింత మంది ప్రజలు నేపాలీల కోసం ప్రార్థనలు చేస్తున్నారు.