: ప్రియుడి గొంతు కోసిన ప్రియురాలు
ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మోసగించాడని భావించిన ప్రియురాలు ప్రియుడి గొంతు కోసింది. స్తంభాద్రిగుట్టపై తనికెళ్లలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతూ ప్రేమలో పడ్డ ప్రేమికులు ఘర్షణపడ్డారు. వెంటపడి ప్రేమిస్తున్నానని కల్లబొల్లి కబుర్లతో మూడేళ్లు ప్రేమాయణం సాగించి, మోసం చేసిన ప్రియుడి గొంతు కోసింది. అనంతరం ఖమ్మం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో యువతి లొంగిపోయింది. తనను మోసం చేసినందునే గొంతు కోశానని అంగీకరించింది. బాధితుడిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.