: భూకంప మృతులకు 2 లక్షల చొప్పున కేంద్ర పరిహారం
నేపాల్ లో సంభవించిన భూకంపం కారణంగా రేగిన ప్రకంపనలకు మృత్యువాతపడిన వారికి కేంద్రం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున అందజేయనున్నట్టు కేంద్రం వెల్లడించింది. కాగా, భూకంపం కారణంగా బీహార్ లో 47 మంది, ఉత్తరప్రదేశ్ లో 17 మంది, బెంగాల్ లో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మొత్తం 70 మందికి కేంద్రం నష్టపరిహారం అందించనుంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సైన్యం తరలివెళ్లింది.