: ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటావా?: ఎర్రబెల్లికి తలసాని సవాల్!


టీ టీడీపీ, టీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం ముదిరిపాకాన పడింది. ఇప్పటికే సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్న నేతలు తాజాగా ఆ సవాళ్ల ఘాటును మరింత పెంచారు. తమ పార్టీ టికెట్ పై గెలిచి టీఆర్ఎస్ లో చేరిన నేతలు, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మొన్న టీ టీడీపీ కార్యకర్తలు చావు డప్పు మోగించిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కొద్దిసేపటి క్రితం ఫైరయ్యారు. టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావును టార్గెట్ చేస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సనత్ నగర్ కు జరిగే ఉప ఎన్నికల్లో తాను ఓటమిపాలైతే, రాజకీయాల నుంచి తప్పుకుంటానని తలసాని ప్రకటించారు. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి ఓడితే, రాజకీయ సన్యాసం తీసుకుంటావా? అంటూ ఆయన ఎర్రబెల్లికి సవాల్ విసిరారు. నోటి మాటతో కాకుండా పెద్ద మనుషుల సమక్షంలో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుందాం రమ్మంటూ తలసాని ఛాలెంజ్ చేశారు. మరి దీనికి ఎర్రబెల్లి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

  • Loading...

More Telugu News