: బెజవాడ మెట్రో రైలు పనులు ఢిల్లీ మెట్రో రైలుకు అప్పగింత!
ఏపీలో విజయవాడతో పాటు విశాఖపట్టణంలోనూ కొత్తగా ఏర్పాటు కానున్న మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి మరింత స్పష్టత వచ్చింది. నేటి ఉదయం ఢిల్లీ మెట్రో రైలు రూపకర్త శ్రీధరన్, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు నగరాల్లో ఏర్పాటు కానున్న మెట్రో రైలు ప్రాజెక్టులపై ఆయన చంద్రబాబుకు వివరించారు. శ్రీధరన్ ప్రజెంటేషన్ విన్న తర్వాత, బెజవాడ మెట్రో పనులను ఢిల్లీ మెట్రో రైలుకే అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించారు. దీనిపై తదుపరి కేబినెట్ భేటీలో ఆమోదం తెలపనున్నారు. విజయవాడలో రెండు దశలుగా మెట్రో పనులను చేపట్టాలని నిర్ణయించగా, విశాఖలో సమగ్ర నివేదిక రూపొందించాలని తీర్మానించారు.