: 9 నెలల గర్భిణీ 5 కిలో మీటర్ల పరుగు... తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు!
కరీంనగర్ కు చెందిన కామారపు లక్ష్మి ప్రస్తుతం తొమ్మిది నెలలు నిండిన గర్భిణీ. ఈ వారంలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. అయితేనేం, ఏకబిగిన 5 కిలో మీటర్ల మేర పరుగు తీసి రికార్డు సృష్టించింది. స్వతహాగా క్రీడాకారిణి అయిన లక్ష్మి, నేటి ఉదయం కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో 5 కిలోమీటర్ల దూరాన్ని 30 నిమిషాల 20 సెకన్లలోనే పూర్తి చేసింది. లక్ష్మి చేసిన ఈ సాహసాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన తెలంగాణ బుక్ ఆప్ రికార్డ్స్ అధికారులు ఆమెకు రికార్డు పత్రాన్ని అక్కడికక్కడే అందజేశారు. ‘‘నిండు గర్భిణీగా ఉన్న మహిళ 5 కిలో మీటర్ల పరుగును ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయడం ఇదే ప్రథమం. ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కు కూడా సిఫారసు చేస్తాం’’ అని వారు పేర్కొన్నారు.